బలం లేని జనసేన ను చూసి వైసీపీకి ఎందుకంత భయం ?!

Update: 2023-05-14 14:17 GMT

Full Viewసహజంగా ఏ రాష్ట్రంలో అయినా బలం లేని పార్టీ ఎంత గోల చేసిన అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోవు..ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు ఆ గోలను లెక్క చేయవు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఎవరినో అడిగితే ఇవ్వరు..అది సాధించుకోవాలి అని విస్పష్ట ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన ల పొత్తును బ్రేక్ చేయటం కోసం తెరవెనక, తెర ముందు ప్రయత్నాలు చేసే శక్తులే పవన్ కళ్యాణ్ ను సీఎం గా ప్రకటిస్తేనే పొత్తులకు రెడీ కావాలి అని ప్రకటనలు చేస్తూ వచ్చారు. వాటికి స్పష్టత ఇవ్వవటం కోసమే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించిన వెంటనే స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనకు బలం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరించారు అని ప్రకటించారు. కాసేపు అయన చెప్పిందే నిజం అనుకుందాం. రాష్ట్ర చరిత్రలోనే ఎవరూ గెలవని రీతిలో ఏకంగా 151 సీట్లు గెలిచిన వైసీపీ మరి బలంలేని జనసేన గురించి ఎందుకింత హైరానా పడుతుంది. ఒక వైపు మంత్రులు..పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా అయన సీఎం పదవి క్లారిటీ ఇచ్చిన దగ్గర నుంచి ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు.

                                    ఎవరైనా బలం లేని పార్టీ గురించి ఇంత హంగామా చేస్తారా ...ఆగమాగం అవుతారా?. అదే సమయంలో తాము నిత్యం తిట్టిపోసే పవన్ కళ్యాణ్ సీఎం కాలేకపోతున్నాడు అన్న చందంగా వైసీపీ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది అంతా ఎందుకో ఎవరికీ తెలియదా?. అధికార వైసీపీ భయం అంతా టీడీపీ, జనసేన కలిస్తే పలు జిల్లాల్లో అధికార పార్టీ కి చుక్కలు కనిపించటం ఖాయం. అందుకే జనసేనకు బలం లేదు అని పవన్ కళ్యాణ్ అంగీకరించారు అంటూనే ప్రస్తుతం సంఖ్యాపరంగా ఎంతో బలంగా ఉన్న వైసీపీ జనసేన పార్టీ పై, పవన్ కళ్యాణ్ పై గ్యాప్ లేకుండా విమర్శలు చేస్తోంది. ఇది చూస్తున్న వాళ్ళు అంతా బలం లేని జనసేనపై వైసీపీ కి అంతా భయం ఎందుకో అని వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags:    

Similar News