హెడ్ మాస్టర్ ముందు స్కూల్ పిల్లాడు కూర్చున్నట్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కూర్చోవటం ఏంటో?. ఖచ్చితంగా ప్రధాని కి గౌరవం ఇవ్వాల్సిందే. కానీ మరీ ఇలాగా. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ఫోటో లు అధికారికంగా విడుదల చేశారు. ఇవే ఇప్పుడు షాకింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. మోడీ ముందు ఉన్న చైర్ లో పూర్తిగా కుర్చీ చివరన కూర్చుని...రెండు చేతులు కూడా జగన్ ఏదో నలుపుకుంటున్నట్లు కూర్చున్న ఫోటో మాత్రం చూసే వాళ్లకు ఏదో లెక్క తేడాగానే ఉంది అనిపించకమానదు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందులోనే ఏకంగా 175 సీట్లు ఉన్న అసెంబ్లీ లో 151 సీట్లు, 25 లోక్ సభ సీట్లు ఉంటే ఏకంగా 22 ఎంపీ సీట్ల ను గెలుచుకున్న పార్టీ అధినేత మరీ ఇంత వీక్ గా ఎందుకు ఉన్నారు అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ ఢిల్లీ కి వెళ్ళేది రాష్ట్ర అవసరాల కోసం కాదు...తన సొంత అవసరాల కోసం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ నేతలు మాట్లాడితే సోనియా గాంధీనే ఎదిరించిన నాయకుడు జగన్ అని చెపుతూ ఉంటారు. మరి కనీసం ప్రధాని మోడీ ముందు సౌకర్యంగా కూడా కూర్చోలేక పోవటం ఏంటో అన్న చర్చ సాగుతోంది. జగన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇదే జగన్ ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దగ్గర మాత్రం ఎప్పటిలాగానే కంఫర్ట్ గా కూర్చున్నారు. మోడీ దగ్గరే తేడాగా కూర్చోవటం చర్చనీయాంశంగా మారింది.