అసెంబ్లీ వేదికగా ఒక కన్ను ఇంకో కన్ను ను పొడుచుకుంటుందా అంటూ వ్యాఖ్యలు
మా కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర అంటూ విమర్శలు
సిబిఐ కోర్ట్ కు సమర్పించిన వివరాలతో వెలుగులోకి వాస్తవాలు
వైఎస్ వివేకా హత్య కేసు కు సంబంధించి వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్ కు ఇరకాట పరిస్థితి. ఇంతకాలం ఈ హత్యకు బయటి వ్యక్తులే కారణం అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. హత్య జరిగిన సమయంలో అయితే ఏకంగా సాక్షి పేపర్ లో నారాసుర రక్తచరిత్ర అంటూ ఫుల్ పేజీ ఐటెం కుమ్మేసారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని రివర్స్ గేర్ వేయటం తో పాటు ఎన్నో ట్విస్టులు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే అంశంపై సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. అందులోని ముఖ్యంశాలు...‘అవినాష్ రెడ్డి. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్షా. నా మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్షా. ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది. ఇవన్నీ జరిగింది ఎప్పుడు. అయన ముఖ్యమంత్రి (చంద్రబాబు )గా ఉన్నప్పుడు. మేము అంతా ప్రతిపక్షంలో ఉన్నాము. పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు. మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే వాళ్లే చేసి ఉండాలి. వాస్తవం చెప్పాలి అంటే. అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి...వక్రీకరించి. ఏవేవో చేసి లాస్ట్ కు దాన్ని మభ్య పెట్టే కార్యక్రం చేస్తున్నారు, మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మాట్లాడితే ఇటువంటి విషయాలన్నీ బాధ అనిపిస్తుంది. పైన దేవుడు ఉన్నాడు. దేవుడే చూస్తుంటాడు.’ అంటూ జగన్ శాసనసభ సాక్షిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సిబిఐ మాత్రం తెలంగాణ హై కోర్ట్ కు సమర్పించిన నివేదికలో మాత్రం వివేకా హత్యకు వైఎస్ అవినాష్ రెడ్డి, అయన తండ్రే కుట్ర చేసారని చాలా స్పష్టంగా చెప్పటంతో పాటు దీనికి సంబంధించి సందర్భోచిత సాక్ష్యాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. వివేకా హత్య కేసు కీలక నిందితుడుగా ఉన్న సునీల్ కుమార్ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సిబిఐ 68 పేజీల నివేదిక కోర్ట్ కు సమర్పించింది. అందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది.
వివేకా హత్య జరగడానికి ముందురోజు... గంగిరెడ్డి... వివేకానంద రెడ్డితోపాటే ఉన్నాడు. జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. యాదాటి సునీల్ యాదవ్‌కు సాయంత్రం 6.22 గంటలకు రెండు కాల్స్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో సునీల్ యాదవ్... అవినాశ్ రెడ్డి/భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. (6.14 గంటల నుంచి 6.33 వరకు అక్కడే ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ఫోన్ లొకేషన్ ద్వారా తేలింది.) గొడ్డలి కొనేందుకు కదిరికి వెళ్లిన షేక్ దస్తగిరి కోసం సునీల్ ఎదురు చూస్తున్నాడు. ‘కదిరి నుంచి పులివెందులకు ఎంత సేపట్లో వస్తున్నావ్’ అని అడిగాడు. వీరిద్దరి మధ్య నడిచిన ‘మెసేజ్’లను సీబీఐ రికవరీ చేసింది. దస్తగిరి రాత్రి 8.30 గంటల సమయంలో పులివెందులకు వచ్చాడు. అప్పటికే తనకోసం ఎదురు చూస్తున్న సునీల్ యాదవ్‌ను కలిశాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి సూచన మేరకు తాను రెండు సిమ్ కార్డులతో వాడుతున్న మొబైల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు.
ఈలోగా సునీల్ యాదవ్ పలుమార్లు అవినాశ్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లాడు.రాజకీయ కారణాలతోనే అవినాష్ రెడ్డి, అయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్లాన్ తో ఈ హత్య చేయించారని ఇందులో పేర్కొన్నారు. ఇటీవల భారతి పీఏ నవీన్ తో పాటు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ని కూడా ఫోన్ కాల్స్ విషయంలో సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా లో వచ్చిన వార్తలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎదురుదాడి చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చి పదేళ్లు అవుతున్నా కూడా సిబిఐ లో ఇంకా ఏదో చంద్రబాబు మనుషులు ఉన్నారు అనే తరహాలో విమర్శలు గుప్పించారు. కానీ సిబిఐ ఇప్పుడు కోర్ట్ కి సమర్పించిన వివరాలతో ఒక కన్ను ఇంకో కన్ను ను పొడిచింది అని స్పష్టంగా తేల్చిచెప్పినట్లు అయింది. రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో ఇది ఖచ్ఛితంగా వైసీపీకి, సీఎం జగన్ ను ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పిన మాటలకూ పూర్తి రివర్స్ లో సిబిఐ రిపోర్ట్ ఉంది.
ఈ కేసు విషయంలో సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా