219 మందికి కమిటీలో చోటు
18 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు..మరో 18 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
రాష్ట్ర కార్యదర్శులు ఏకంగా 108 మంది
అధికారంలో ఉంటే ఒకలా. ప్రతిపక్షంలో ఉంటే మరోలా. తెలుగుదేశం పార్టీ శుక్రవారం నాడు 'ఎయిర్ బస్' రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఏకంగా 219 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. అసలు పార్టీ అధినేత అయినా కమిటీలో ఉన్న వారి పేర్లు గుర్తుంచుకోగలుగుతారా?. సంఖ్య ముఖ్యమా?. పని తీరు ముఖ్యమా? అందరికీ చోటు కల్పించాలి..అందులో సామాజిక సమీకరణలు చూసి పదవులు ఇచ్చామని చెప్పుకోవాలి. ప్రజలు ఈ కమిటీని చూసి ఓట్లు వేస్తారా?. లేక మరేమైనా కారణాలు ఉంటాయా?. రాష్ట్ర కమిటీలో ఏకంగా 18 మందికి ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టారు. ప్రధాన కార్యదర్శులు కూడా అంతే స్థాయిలో మరో 18 మందికి చోటిచ్చారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టులు అయితే ఏకంగా 59 మందిని నియమించారు. రాష్ట్ర సెక్రటరీల సంఖ్య అయితే 108కి పెరిగింది. పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు కన్పించకుండా పోయిన వారికి కూడా రాష్ట్ర కమిటీలో పదవులు దక్కాయి.
ఏపీ పార్టీ ఉపాధ్యక్షులుగా నిమ్మల కిష్టప్ప, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రు, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం, దాట్ల సుబ్బరాజు, పిడతల సాయి కల్పనా రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్,, సుజయ క్రిష్ట రంగారావు, బి వి జగదీశ్వరెరెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, జి. తిప్పేస్వామి, వి. హనుమంతరాయ చౌదరి, పుత్తా నర్సింహారెడ్డి, దామచర్ల జనార్ధన్ రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద సూర్యలకు ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎన్. అమర్ నాథ్ రెడ్డి, డోలా వీర అంజనేయస్వామి, బి టి నాయుడు, గన్ని కృష్ణ; భూమా అఖిలప్రియ, ఎం డీ నజీర్, పంచుమర్తి అనురాధ, బి. చెంగల్రాయుడు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్ధా వెంకన్న,, చింతకాయల విజయ్, మద్దిపాటి వెంకటరాజులకు చోటు కల్పించారు.