ఏపీలో ఇసుక సమస్యపై టీడీపీ నిరసన

Update: 2020-12-02 05:02 GMT

తెలుగుదేశం పార్టీ ఏపీలో ఇసుక సమస్యపై నిరసన ప్రదర్శన చేపట్టింది. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు తాపీ మేస్త్రీల పనిముట్లతో నిరసన ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, పలు ఇతర రంగాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. అధికార పార్టీ నేతల దోపిడీకి ఇసుక ఓ ఆయుధంగా మారిందని విమర్శలు గుప్పించారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.

టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించారని విమర్శించారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులవి అన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. కొత్త విధానంపై ముఖ్యమంత్రి, మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మనస్సు మార్చుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags:    

Similar News