ఏపీలో రాజకీయ హత్యలు వరస పెట్టి సాగుతున్నాయి. ఓ వైపు నందం సుబ్బయ్య హత్య ఘటన మరవక ముందే ఆదివారం రాత్రి మరో హత్య జరిగింది. అయితే ఇది పల్నాడు ప్రాంతంలో. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ నేత పురంశెట్టి అంకులు హత్యకు గురవడంతో స్థానికంగా సంచలనానికి దారి తీసింది. మాజీ సర్పంచ్ అంకులును గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. దాచేపల్లి సెంటర్‌లో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ సర్పంచ్ హత్య ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.