
ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. హైకోర్టు తీర్పుతో పాటు పలు జిల్లాల కలెక్టర్ల బదిలీ అంశం, ఉద్యోగ సంఘాల నేతల ప్రకటనలు రమేష్ కుమార్ ఓ నివేదికను గవర్నర్ కు అందజేసినట్లు సమాచారం.
మరో వైపు హైకోర్టు నిర్ణయంపై ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంలో స్టే లభించకపోతే ఎన్నికలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల వ్యవహారం అటు ఏపీ సర్కారుకు, ఇటు ఎస్ఈసీకి మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది.