
అతి తక్కువ ధర విమాన టికెట్ తో సింగపూర్ వెళ్లాలనుకుంటున్నారా?. అలాంటి ఆలోచన ఉన్న వాళ్లకు ఇదే బెస్ట్ ఛాన్స్ . ఎందుకంటే సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన చౌక ధరల ఎయిర్ లైన్స్ స్కూట్ కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక విక్రయాలు కొనసాగనున్నాయి.ఈ సేల్ ఆగస్ట్ 28 నుండి సెప్టెంబర్ 01, 2023 వరకు అందుబాటులో ఉంటుంది అని స్కూట్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ ఆఫర్ కింద విశాఖపట్నం నుంచి సింగపూర్ టికెట్ ధర 6300 రూపాయలుగా నిర్ణయించారు. ఇది ఒక వైపు ప్రయాణానికి. ఈ ఆఫర్ కింద టికెట్స్ బుక్ చేసుకుంటే విశాఖ పట్నం నుంచి ప్రయాణించాలనుకునే వారు ఇప్పటి నుంచి నవంబర్ 12 వరకు, తర్వాత నవంబర్ 22 నుంచి డిసెంబర్ 14 తేదీల మధ్య సింగపూర్ ప్రయాణించవచ్చు అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది.