రఘురామకృష్ణంరాజు ఎఫ్ఐఆర్ లో టీవీ5..ఏబీఎన్ ల పేర్లు

Update: 2021-05-15 06:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.ఎఫ్ఐఆర్ లో ఎంపీ ఆర్ఆర్ఆర్ తోపాటు టీవీ5, ఏబీఎన్ పేర్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈ రెండు ఛానళ్లు రఘురామకృష్ణంరాజుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం స్లాట్స్ కేటాయించి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని పేర్కొన్నారు. ఈ ఛానళ్ళ ప్రధాన వ్యక్తుల మనసు తెలుసుకుని..అందుకు అనుగుణంగా ఇది అంతా సాగిందని పేర్కొన్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయా ఛానళ్ళలో స్లాట్స్ కేటాయించారని తెలిపారు. రఘురామకృష్ణంరాజుతోపాటు కొన్ని ఛానళ్ళు పక్కా కుట్ర పూరితంగా ప్రభుత్వం విద్వేష ప్రచారం ప్రారంభించాయని పేర్కొన్నారు. కులాలు..ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఈ చర్యలకు దిగారని ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీవీ5, ఎబీఎన్ చానల్ లపై సుమోటోగా సిఐడి కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News