వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయన్ను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ నంబర్‌ 3468 కేటాయించారు. జైల్లోని బ్యారక్‌లో ఒక సెల్‌ను అలాట్‌ చేశారు. రఘురామకృష్ణంరాజుకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించింది. రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/2021 నమోదు చేశారు.

Tags: