ఎయిర్ ఇండియా వన్ లో తిరుమలకు రాష్ట్రపతి

Update: 2020-11-24 08:13 GMT

భారత్ కు ఇటీవలే అత్యంత ఖరీదైన వివిఐపి విమానాలు ఎయిర్ ఇండియా వన్ చేరుకున్నారు. ఒక విమానం ప్రత్యేకంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి కోసం, మరో విమానం ప్రధాని నరేంద్రమోడీల కోసం కొనుగోలు చేశారు. ఈ రెండు విమానాల ధర సుమారు 2800 కోట్ల రూపాయల వరకూ అయింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం నాడు ఎయిర్ ఇండియా వన్ ను ప్రారంభించారు.

అనంతరం ఆ విమానంలోనే ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ లో ఆయనకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.

Tags:    

Similar News