ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు బంట్రోతులా పనిచేస్తున్నారని విమర్శించారు. గురువారం తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పంచాయతీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాను ఉల్లంగిస్తున్నాను అని ఎస్ఈసీ చెప్పడం బ్లాక్ మెయిల్ చేయటమేనని అన్నారు.
ద్వివేదిపైన చంద్రబాబుకు కోపం, అందుకే ఆయనపై చర్యలకు ఎస్ఈసీని ఉపయోగించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఈసీగా రమేష్ ఉండటం దురదృష్టకరమన్నారు. పంచాయితీలు తప్పనిసరిగా ఏకగ్రీవం కావాలన్నారు.పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడి గెలిచే వారిని అడ్డుకోవడం కోసమే రూ.10వేలు జరిమానా. 3 సంవత్సరాలు జైలు చట్టం తెచ్చామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.