అప్పుడే రాజకీయాల్లో మార్పు

Update: 2021-02-17 15:53 GMT

'గ్రామాల నుంచి విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో మనకు దక్కిన ఆదరణ.. తెలుస్తున్న గణాంకాలు మార్పునకు సంకేతం.' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తొలి రెండు విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచులతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. విజేతలకు అభినందనలు తెలిపి... ప్రజలు వారిపై ఉంచిన ఆశలను, ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. "సదాశయంతో, సిద్ధాంత బలంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయని తెలిసే 25 ఏళ్ల ప్రయాణం అని చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నిక లు చేయడం ఎలా కుదురుతుంది? వేల కోట్లు ఉన్న వ్యక్తుల ముందు మీరు నిలబడగలరా? అని చాలా మంది అడిగారు.

నాలాగా ఆలోచించి, ఆశయాల కోసం బలంగా నిలబడే యువత, ఆడపడుచులు ప్రతి గ్రామంలో ఉంటారు, వారిని నడిపించే వ్యక్తి ఒకరు కావాలి. నేను నిలబడితే వాళ్లంతా నా వెంట నిలబడతారనే గాఢమైన నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. ' అని పేర్కొన్నారు. గెలిచినవారిపైనా ఎన్నో ఒత్తిళ్ళు తీసుకువస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు అని గెలిచిన మనవాళ్లు చెప్పారు. ఎవరు ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేసినా.. ఆందోళన చెందవద్దు. మీ వెన్నంటి ఉంటాను. అదే విధంగా మీరు గెలిచిన చోట అభివృద్ధి చేయనీయం అంటే బలంగా ఎదుర్కొందాం. పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. వాటికి రాష్ట్రంలోని అధికార పక్షం ఏవైనా ఇబ్బందులు కలిగిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుందామని తెలిపారు.

Tags:    

Similar News