ఏపీలో నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెట్టారు. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు సోమవారం నాడు రోజు దీక్ష చేపట్టారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారని జనసేన ప్రకటించింది. ఎన్నికల సమయంలో గెలవటం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నేతలు..కష్టాల్లో ఉన్న రైతులు, ప్రజలను ఆదుకునేందుకు రూపాయి కూడా బయటకు తీయరని తన పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు.