ఏపీలో లాక్ డౌన్ ఉండదు

Update: 2021-05-01 15:55 GMT

కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సమర్థవంతంగా అన్ని వనరులను ఉపయోగించుకుంటోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కొంత మంది రకరకాలుగా చెబుతున్నారని..అయితే ఈ దశలో లాక్ డౌన్ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలి. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని సజ్జల తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం జగన్‌ పాలన చేస్తున్నారు.

ఆర్థిక సంక్షోభంలోనూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్‌ పాలన ఉంది. మా పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుంది'' అన్నారు. ''చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు.. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలసి రావాలని సజ్జల కోరారు. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 19412 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Tags:    

Similar News