ఏపీలో సర్కారు వర్సెస్ ఎస్ఈసీ వివాదం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణల తీరుపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే పదవి నుంచి తప్పించాలని కోరారు. ఈ లేఖలపై సర్కారు తీవ్రంగా మండిపడింది. మంత్రులు...సజ్జల ఎస్ఈసీపై విమర్శల దాడి మరింత పెంచారు. అంతే కాదు..శనివారం నాడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
పరిధి దాటి తమపై విమర్శలు చేశారని మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు ఈ మేరకు స్పీకర్ కార్యాలయంలో ఈ నోటీసులు అందజేశారు. నిమ్మగడ్డ పరిధి దాటి వ్యవహరించారని..ఆయన తీరు అభ్యంతరకరం అని పెద్ది రెడ్డి విమర్శించారు. మరి ఈ పరిణామాలపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.