నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి అరెస్ట్

Update: 2020-11-08 15:44 GMT

ఓ మైనారిటీ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం కర్నూలులో దుమారం రేపుతోంది. తమకు ఏ మాత్రం సంబంధం లేని దొంగతనం కేసు తమపై మోపారనే కారణంతో రైలు పట్టాలపై అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వ్యవహరానికి సంబంధించి తాజాగా ఓ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను ఆదివారం నాడు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే సీఐ సోమశేఖర్‌రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐజీ శంకబ్రతబాగ్జి, ఐపీఎస్‌ అధికారి అరిఫ్‌ అఫీజ్‌ కేసు విచారణను ప్రారంభించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ విచారణకు ఆదేశించారు.

అబ్దుల్‌ సలాం (45), అతని భార్య నూర్జహాన్‌ (38), కుమారుడు దాదా ఖలందర్‌ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3వ తేదీన గూడ్స్‌ రైలు కిందపడి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సలాం, అతని భార్య నూర్జహాన్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో శనివారం వెలుగులోకి రాగా.. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణ విచారణ జరిపించాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ను ఆదేశించారు. ఆ వెంటనే షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News