మాట మీద నిలబడ్డారు!

Update: 2024-06-20 10:04 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు...పవన్ కళ్యాణ్ పిఠాపురం లో గెలిస్తే తన పేరు మార్చుకుంటాను అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించటమే కాదు....జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు ఎప్పుడు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అయన ఈ అంశంపై స్పందించారు.

                                            తాను చెప్పినట్లు పేరు మార్పునకు సంబంధించి పత్రాలు రెడీ చేసి పెట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే చెప్పినట్లే ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. కాపు ఉద్యమనేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ఈ దశలో తన పేరు మార్చుకోవాల్సి రావటం కంటే అవమానం మరొకటి ఏమి ఉండదు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం చెప్పినట్లు పేరు మార్చుకుని ఆయన మాట మీద నిలబడ్డారు అనే వాళ్ళు కూడా ఉన్నారు.

Tags:    

Similar News