మెగా స్టార్ చిరంజీవి లో ఎందుకీ మార్పు?. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్నా కూడా ఎప్పుడూ స్పందించని చిరంజీవి ఇప్పుడు పేరు పెట్టకపోయినా జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది కూడా భోళా శంకర్ సినిమా విడుదలకు ముందు అయన ఈ మాటలు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికార వైసీపీ నేతలు, మంత్రులు.. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రో పై పెద్ద ఎత్తున ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన డ్యాన్స్ కు స్పూఫ్ పెట్టారనే కారణంగా అంబటి రాంబాబు ఏకంగా ఈసినిమాకు నిధులు విదేశాల నుంచి ఆక్రమమార్గంలో వచ్చాయని..దీనిపై ఫిర్యాదు చేస్తున్నానని చెప్పటమే కాకుండా..ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అదే సమయంలో అసలు పవన్ కళ్యాణ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు...వంటి అంశాలను కూడా ఆయన లేవనెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో వాల్తేర్ వీరయ్య సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజుల పూర్తి చేసుకున్న సాదరంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడే చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.