జగన్ కు వాటికన్ అంటే ఆనందం..అమరావతి అంటే కంపరం

Update: 2021-01-05 11:12 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వాటికన్ సిటీ అంటే ఆనందం...అమరావతి అంటే కంపరం అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. అమరావతి దేవుళ్ళు సంచరించిన ప్రాంతం అని తెలిపారు. జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. 'తాడిపత్రి లో ఒక ఎమ్మెల్యే ఆంబోతులా మా నేతల ఇంటిపై పడతాడా!? ప్రత్యేక హోదా పై జగన్ నాడు రాగాలు తీస్తూ మాట్లాడాడు. 22 ఎంపీలు ఏం చేస్తున్నారు...వ్యాపారాల కోసమే వైసీపీ ఎంపీలు.వివేకా హత్యపై సీబీఐ కి కూడా విశ్వసనీయత నిలబెట్టుకోవాలి. రామతీర్ధం నేను ఎందుకు వెళ్లకూడదు...ఎందుకు అడ్డుకున్నారు. 5 రోజులు ప్రభుత్వం ఏ గడ్డి పీకింది. శ్రీరాముడు తల తీసినప్పుడే... ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి. నాపై కేసు పెడతారా?. జగన్ ఒక క్రిస్టియన్... అతని నమ్మకం అతనిది....మా నమ్మకం నాది. విజయనగరం ఎస్పీ ఒక మహతల్లి...ఆమె మమ్మల్ని అడ్డుకుంది. సాయి రెడ్డి ని తీసుకు వెళ్లి పూజలు చేస్తారా.

మెజారిటీ ప్రజలు ఉండే హిందువుల మనోభావాలు కొనసాగించాలి. సీఎం, హోమ్, డీజీపీ తో పాటు స్థానిక ఎస్పీ కూడా క్రిస్టియన్. జిల్లా ఇంచార్జి గా ఉన్న వెల్లంపల్లి...అశోక్ గజపతి పై వ్యాఖ్యలు చేస్తారా!. గజపతి కుటుంబం తో వీళ్ళకి పోలిక ఉందా. ముఖ్యమంత్రి మత మార్పిడులు చెయ్యడం ఏంటి!?. పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా....శ్రీవారి టెంపుల్లో క్రిస్మస్న్ శుభాకాంక్షలు చెపుతారా. క్రిస్టియన్ లకే మనోభావాలు ఉంటాయా....హిందువులకు, ముస్లింలకు ఉండవా!? సీఎం ఏం ఒరగబెడుతున్నారని మేము అడ్డుకుంటాం. ఫాస్టర్ల కు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధం. రిజర్వేషన్ లు ఉన్న ఫాస్టర్ లకు 5 వేలు ఇవ్వడం ఎందుకు' అంటూ ప్రశ్నించారు.

Tags:    

Similar News