వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఈ పిటీషన్ పై ఇప్పటికే కోర్టు కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సీబీఐతో పాటు జగన్ ను ఆదేశించింది. ఇప్పటికే ఓ సారి గడువు కోరిన జగన్ తరపున న్యాయవాదులు..సోమవారం నాడు విచారణ జరిగిన సందర్భంలోనూ తమకు మరింత సమయం కావాలని కోరారు. అయితే సీబీఐ కోర్టు ఇదే చివరి అవకాశం అని..తదుపరి విచారణను మే 26కి వాయిదా వేసింది. సీఎం హోదాలో జగన్ తన కేసులకు సంబంధించి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.