ఏపీ కేబినెట్ కూ జబర్దస్త్ కు ఆ లింకేంటో?!

Update: 2024-12-11 13:47 GMT

ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ను జబర్దస్త్ లింక్ వీడటం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఈ లింక్ మాత్రం అలా కొనసాగుతూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆర్ కె రోజా మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె జబర్దస్త్ షో లో జడ్జి గా వ్యవహరించారు. మంత్రి కావటానికి ముందే ఆమె ఆ షో వదిలేశారు. విచిత్రం ఏమిటి అంటే ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్ లోకి కూడా గతంలో జబర్దస్త్ షో జడ్జి గా వ్యవహరించిన నాగబాబు చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే చంద్రబాబు నాయుడు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే నాగబాబు ను మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకుంటారు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కూడా పూర్తి అయితే చంద్రబాబు క్యాబినెట్ లో మరో జబర్దస్త్ జడ్జి చేరినట్లు అవుతుంది. నాగబాబు కూడా చాలా కాలం జబర్దస్త్ జడ్జి గా వ్యవహరించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని గత రెండు క్యాబినెట్ ల కూ జబర్దస్త్ తో లింక్ ఏర్పడినట్లు అయింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Similar News