జ‌గ‌న్.. ఇది ఇసుక యాడ్స్ ఇచ్చే స‌మ‌య‌మా?

Update: 2021-11-21 10:28 GMT

ఏపీ స‌ర్కారు ఇసుక జాకెట్ యాడ్స్ పై జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ లు మండిప‌డ్డారు. వీరిద్ద‌రూ ఈ యాడ్స్ పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 'వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ? అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ?

వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up @ysjagan ! అంటూ జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ట్వీట్ చేశారు. గ‌త కొన్ని రోజులుగా ఏపీలోనిజ ప‌లు జిల్లాల్లో వ‌ర‌ద భీభ‌త్సంతో ప్ర‌జ‌లు తీవ్ర క‌ష్టాల పాలు అవుతున్నారు. ఈ స‌మ‌యంలో ప్ర‌ధాన పత్రిక‌ల్లో అంద‌రికీ అందుబాటులో ఇసుక‌..పార‌దర్శ‌క విధానంలో ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌కే నాణ్య‌మైన ఇసుక అంటూ యాడ్స్ ఇచ్చారు. మ‌రో విశేషం ఏమిటంటే ఇసుక వ్యాపారం మొత్తాన్ని ప్రై్వేట్ ప‌రం చేసిన స‌ర్కారు కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప్ర‌జ‌లు సొమ్ముతో యాడ్స్ ఇవ్వ‌టం మ‌రో వింత‌.

Tags:    

Similar News