శ్రీశైలం లో ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సత్రంలో దంపతులు తనువు చాలించారు. అయితే వీరి ఆత్మహత్యకు కారణాలేంటో తెలియదు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మీ, అంకాలేశ్వర్ రావుగా వీరిని గుర్తించారు. వీరిద్దరి వయస్సు వరసగా 32, 35 సంవత్సరాలు. . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.