తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

Update: 2021-01-31 13:23 GMT

అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం పూర్తి అయింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల పోరు కంటే ఏపీ సర్కారు వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య సాగుతున్న పోరే ఎన్నికలను మించి ఉత్కంఠ రేపుతోంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల చివరి రోజున అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల నామినేషన్ల పరిశీలిస్తారు.

ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

Tags:    

Similar News