హాట్ టాపిక్ గా పీ వీ రమేష్ రాజీనామా

Update: 2023-09-12 14:56 GMT

Full Viewపీ వీ రమేష్ రాజీనామా తెలుగు రాష్ట్రాల రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు అనుకూలంగా మాట్లాడిన రోజే అయన ప్రస్తుతం పని చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కి రిజైన్ చేశారు. ఈ రాజీనామా లేఖ సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. రిటైర్ ఐఏఎస్ అధికారి అయిన పీ వీ రమేష్ గత కొంత కాలంగా మేఘా ఇంజనీరింగ్ లో సేవలు అందిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో నిధులు విడుదల చేసిన అధికారులను వదిలేసి...విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు పై కేసు పెట్టి అరెస్ట్ చేయటం తప్పు..ఇది సరైన విధానం కాదు అంటూ అయన మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, వివిధ శాఖల్లో పని చేసిన అధికారిగా పీ వీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ తరుణంలో అయన చంద్రబాబు కు అనుకూలంగా మీడియా వేదికగా మాట్లాడటం ఒకటి అయితే...ఆ వెంటనే వ్యక్తిగత కారణాలతో అంటూ మేఘా ఇంజనీరింగ్ కు రాజీనామా చేయటం తో తెర వెనక ఏమి జరిగి ఉంటుంది అనే చర్చ తెర పైకి వచ్చింది. ఇప్పటివరకు మేఘా లో జాబ్ చేయటానికి లేని ఇబ్బంది సడన్ గా ఎందుకొచ్చింది అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పీ పీ రమేష్ ప్రెస్ మీట్ తర్వాత తెర వెనక ఏదో జరిగి జరిగి ఉంటుంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. అయితే పీ వీ రమేష్ మాత్రం సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్లు రాజీనామా చేయమని మేఘా కంపెనీ యాజమాన్యం తనను కోరలేదు అని..తానే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News