ఏపీలో మరో ఎన్నికలు. ఇఫ్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సాగుతుండగా, కొత్తగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయింది. గురువారం నాడు కొత్తగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4న ఆఖరు తేదీగా ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మార్చి 15న పోలింగ్ నిర్వహిస్తారు. ఇదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ జరుపుతారు.