వాస్తవానికి ఆ పార్టీ లు ఇక బదిలీ ఉండదు అని భావిస్తున్న సమయంలో డీజీపీ పై వేటు పడటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై క్లారిటీ వచ్చిన తర్వాతే బీజేపీ కూడా ఈ విషయంలో ఇప్పుడు వేగంగా ముందుకు కదిలింది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఫలితంపై రాజకీయ పార్టీలకు కూడా స్పష్టత వస్తుంది అని చర్చ సాగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే పలు అంశాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండగా ..ఇప్పుడు కొత్తగా తెరమీదకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎన్నికల ముందు పెద్ద దుమారం రేపుతోంది. ఇది కూడా అధికార వైసీపీ కి నష్టం చేసే అవకాశం ఉంది అనే భయం అధికార పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది.