డాల‌ర్ శేషాద్రి హ‌ఠాన్మ‌ర‌ణం

Update: 2021-11-29 03:27 GMT

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశ‌, విదేశాల్లో ఉన్న తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తులంద‌రికీ ఆయ‌న సుప‌రిచిత‌మే. అంతే కాదు..ఏ వివిఐపి వ‌చ్చినా వారి వెంట ఆయ‌న ఉండాల్సిందే. అలాంటి డాల‌ర్ శేషాద్రి ఇక లేరు. ఆయ‌న సోమ‌వారం వేకువ‌జామున గుండెపోటు రావ‌టంతో తుది శ్వాస విడిచారు. విశాఖ‌ప‌ట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన డాల్లర్ శేషాద్రి గుండేపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. 1978 వ సంవత్సరం నుంచి ఆయ‌న శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో ప‌ద‌వి విర‌మ‌ణ చేసినా శేషాద్రి సేవలు టిటిడికి తప్పనిసరి కావడంతో ఆయ‌న్ను ఓఎస్టీగా కోనసాగిస్తున్నారు. తిరుమ‌ల‌కు సంబంధించిన ఆచార వ్య‌వ‌హారాలు ఆయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియదు అంటారు.

శేషాది మ‌ర‌ణంపై టీటీడీ ఛైర్మ‌న్ వై వీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోట‌న్నారు. తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి ఉన్నార‌ని తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అని వ్యాఖ్యానించారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశార‌ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానన్నారు. 

Tags:    

Similar News