దేవుల‌ప‌ల్లి అమ‌ర్ కు ఇండియా ద‌ర్శ‌న్ అవార్డు

Update: 2022-03-19 13:25 GMT

ఏపీ ప్ర‌భుత్వ జాతీయ‌, అంత‌రాష్ట్ర మీడియా వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు ఇండియా ద‌ర్శ‌న్ జాతీయ స‌మ‌గ్ర‌తా అవార్డు అందుకున్నారు. శ‌నివారం నాడు కొచ్చిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌కు ఈ అవార్డు ప్ర‌ధానం చేశారు. ఎంఎన్ టీవీ ఇండియా ప్ర‌తి ఏటా ఈ అవార్డులు బ‌హుక‌రిస్తుంది. జర్నలిజం రంగంలో చేసిన సేవలకు టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022 పురస్కారాన్ని శ్రీ అమర్ అందుకున్నారు. వి.బి. రాజన్ సీనియర్ జర్నలిస్ట్, అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు, తదితరులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News