కూటమిలో చిచ్చురేపుతున్న చేరికలు

Update: 2024-09-23 04:53 GMT

బాలినేని వ్యవహారంపై దామచర్ల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమిలో చేరికల వ్యవహారం చిచ్చు రేపుతోంది. కూటమిలో ప్రధాన పార్టీ గా ఉన్న జనసేన లోకి వైసీపీ కి చెందిన కీలక నేతలు చేరుందుకు సిద్ధం అయ్యారు. ఇందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉదయ భాను, కిలారి రోశయ్య వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అంతా ఇటీవల జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయి చేరికల అంశంపై మాట్లాడుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలే అటు బాలినేని శ్రీనివాసరెడ్డి తో పాటు కిలారి రోశయ్య పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి చేసింది కూడా తెలుగు దేశం పార్టీ నాయకులే. ఇప్పుడు అదే నాయకులను జనసేన చేర్చుకోవటానికి నిర్ణయించుకోవడం దుమారం రేపుతోంది.

                                                                            బాలినేని జనసేన లో చేరిక అంశంపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సమక్షంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. దామచర్ల జనార్దన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ నువ్వు మాత్రం ఆ పార్టీ లోకి వెళ్లినా..ఏ పార్టీ లో ఉన్నా కేసులు అనేది నిన్ను మేము వదిలిపెట్టం. నువ్వు ఏదైతే పాపాలు చేశావో ..ఏ విధంగా కేసులు పెట్టి మనుషులను ఇబ్బంది పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు. మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో అక్కడికి పో. పవన్ కళ్యాణ్ ఆ రోజు నిన్ను కాపాడతారా?.ఆ రోజు ఏమి జరుగుతుందో చూపిస్తాం అంటూ ’ వ్యాఖ్యానించారు.

                                                                     విచిత్రం ఏమిటి అంటే గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని శ్రీనివాస రెడ్డి మైత్రి మూవీ మేకర్స్ లో పెట్టుబడి పెట్టినట్లు జనసేన కు చెందిన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఐటి శాఖ అధికారులకు అప్పటిలో ఫిర్యాదు కూడా చేశారు. ఇదే  సంస్థ పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. అయితే ఈ ఆరోపణలు అప్పటిలోనే తోసిపుచ్చిన బాలినేని తనకు సినిమా పరిశ్రమలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ..తాను ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు అని వివరణ ఇచ్చుకున్నారు. జనసేన తనను టార్గెట్ చేసింది అంటూ కూడా ఆయన అప్పటిలో వాపోయారు. ఇప్పుడు అదే జనసేనలో చేరటానికి సిద్ధం అయిపోయారు. దామచర్ల విమర్శలపై బాలినేని కూడా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తాను జనసేన లో చేరటం నచ్చకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని..వీటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానన్నారు. మరి ఈ చేరికల వ్యవహారాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News