చంద్రబాబుపై కేసు...మరి మంత్రిపై కూడా పెట్టండి

Update: 2021-05-09 13:17 GMT

ఏపీలో కరోనా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగుదేశం అధినేత ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎన్ 440కె వైరస్ పై దుష్ప్రచారం చేశారని..దీని వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారంటూ కర్నూలులో కేసు నమోదు అయింది. దీనిపై పోలీసులు చంద్రబాబుకు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాదు..చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీనికి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. కర్నూలులో ఎక్కడైతే చంద్రబాబునాయుడిపై కేసు నమోదు అయిందో అదే పోలీస్ స్టేషన్ లో ఏపీ మంత్రి అప్పలరాజుపై కేసు పెట్టింది. ఈ మంత్రి కూడా ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కర్నూలులో N440K వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇలా అనడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు అని, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారని అతని పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీ నాయకుడు రవికుమార్ ఈ ఫిర్యాదు చేశారు.. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను చిన్నచూపు చూస్తూ.హేళనగా మాట్లాడుతున్నారని..మంత్రి మాటల వల్ల మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇప్పుడు కర్నూలు పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News