ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పనిచేస్తే అదే రాజధాని అవుతుందని అన్నారు. అది పులివెందుల కావొచ్చు...అమరావతి, విశాఖపట్నం ఏదైనా కావొచ్చన్నారు.
గౌతంరెడ్డి మంగళవారం నాడు తిరుపతి ఎస్ వీయూ హాలులో జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదంలేదన్నారు. సీఎం ఎక్కడ నుంచి పనిచేస్తే అదే రాజధాని అన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అని తెలిపారు.