ఎందుకంటే జగన్ కు ఎక్కడా..ఎప్పుడూ ఏ ఇబ్బంది కానప్పుడు ఆర్ధిక పరిస్థితి బాగున్నట్లే లెక్క కదా?. రోడ్లు లేక ఇబ్బందులు పడితే అది ప్రజల సమస్య. జీతాలు సకాలంలో రాక, పెన్షనర్లు పెన్షన్ల కోసం ఇబ్బంది పడితే అది వాళ్ల సమస్య. అసలు ఎవరైనా మద్యం అమ్మకాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారా అని చంద్రబాబును గట్టిగా ప్రశ్నించి..మద్యం ఆదాయం రాకూడదని..పథకాలు ఆగిపోవాలని కొంత మంది కుట్ర చేస్తున్నారని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెపితే అందరూ ఆ మాటలను నమ్మితీరాలి. అసలు దావోస్ పర్యటనలు ఎందుకు దండగా అని విమర్శించిన నోటితోనే తాము దావోస్ వెళ్లి పెట్టుబడుల వరద పారించామని చెపితే కూడా నమ్మాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆర్ధికంగా బాగుంది..పారిశ్రామికంగా దూసుకెళుతుంది..రహదారులు రయ్ రయ్ మంటూ వెళ్లమని స్వాగతం పలుకుతున్నాయి..ఇది నిజం. నమ్మితీరాల్సిందే. నమ్మకపోతే ఎవరూ ఏమీ చేయలేరు.