ఓట‌మిని అంగీక‌రించ‌లేని స్థితిలో ప్ర‌తిపక్షం

Update: 2021-09-20 08:00 GMT

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తిప‌క్షం, మీడ‌యాతో విమ‌ర్శ‌లు గుప్పించారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. కోర్టుల ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌క్కుండా అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం​ ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు.కోవిడ్‌ పేరుతో గతంలో కౌంటింగ్‌ కూడా వాయిదా వేయించారని విమ‌ర్శించారు.

ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్‌ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News