వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూ్డ్ వీడియో బయటకు వచ్చిన తరుణంలో టీవీల నిండా కన్పించిన వార్త ఇదే. జగన్ సీరియస్..జగన్ సీరియస్. మాధవ్ పై సస్పెన్షన్ వేటు లేదా బహిష్కరణ అంటూ ఊదరగొట్టారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నారు అది రాగానే...ఒక సందేశం ఇచ్చేలా కఠినాతికఠినమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. కానీ రోజులు గడుస్తున్నాయి కానీ...ఈ ఫోరెన్సిక్ నివేదిక రాదు..చర్యలు లేవు. జగన్ సీరియస్ కూడా కామెడీయే అన్న చర్చ సాగుతుంది. ప్రభుత్వానికి ప్రతికూలంగా ఏదైనా అంశం తెరపైకి వచ్చినప్పుడు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారంటూ మీడియాకు లీకులు ఇవ్వటం..ఆ సీరియస్ నెస్ కాస్త చల్లారిన తర్వాత అంతా మర్చిపోవటం ఎప్పటి నుంచో ఉంది.
ఇప్పుడు సీఎం జగన్ కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యారనే చర్చ సాగుతోంది. అయితే ఎంపీ మాధవ్ విషయంలో అటు అధికార వైసీపీకి, ఏపీ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో రాజకీయంగా డ్యామేజ్ జరిగింది. పోనీ ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది..అది ఫేక్ వీడియో అని ఏమైనా ప్రకటించారా అంటే అదీ లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీనే తాను జిల్లాఎస్పీకి..ఇతరులకు పిర్యాదు చేశానని అందరిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. ఫేస్ బుక్ లో అనుచిత పోస్టులు పెట్టిన కేసుల్లోనే అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్న ఏపీలో ఓ అధికార ఎంపీకి సంబంధించి న్యూడ్ వీడియోను రాజకీయ ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో విడుదల చేస్తే ఇప్పటివరకూ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా నో అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అయినా చర్యలు ఉంటాయో లేదో వేచిచూడాల్సిందే.