విద్యార్ధుల గురించి నాకంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు

Update: 2021-04-28 08:08 GMT

పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరీక్షల నిర్వహణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు రద్దు చేయమనటం..రద్దు చేయటం పెద్ద కష్టం కాదన్నారు. కానీ పరీక్షలు లేకుండా విద్యార్ధులకు కేవలం పాస్ సర్టిఫికెట్లు ఇస్తే తర్వాత వారు ఇబ్బందులు పడతారని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించి..మన దగ్గర జరపకపోతే నష్టపోయేది విద్యార్ధులే అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్ గురించి తన కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్‌ కోసం తాను ఆలోచిస్తాని సీఎం జగన్ తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదన్నారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా కాలేజీలో సీటు వస్తుందని గుర్తుచేశారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న వసతి దీవెన' పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాడు రూ.1,048.94 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News