బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, మరోసారి వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం. నవంబర్‌లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని జగన్ తెలిపారు. అయితే కొద్ది రోజుల క్రితం పీకె టీమ్ నిర్వహించిన సర్వేలో మాత్రం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉన్నట్లు కన్పించలేదని నివేదికలు వచ్చినట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించే జగన్ పార్టీ నేతల్లో జోష్ నింపేందుకే పదే పదే కుప్పంతోపాటు 175 సీట్ల జపం చేస్తున్నారని..మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే.