ఈ సమావేశంలో జగన్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి...' మనం ఇక్కడ యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోనే..తెలుగుదేశం పార్టీతోనే కాదు. పని కట్టుకుని అదే మాదిరిగా ఎంత మంచి చేసినా కాదు..అది చెడే అని ప్రచారం చేస్తున్న నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నాం. మీడియా సంస్థలు కూడా ఈ మాదిరిగా చొక్కాలు విప్పేసి ఏకంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఇంతగా కష్టపడే పరిస్థితి నేనెప్పుడూ చూడలా. అయినా కూడా ఇలాంటి దుర్మార్గమైన మీడియా వ్యవస్థను చూస్తున్నాం కాబట్టి..మనం చేసింది తప్పులేదు..వాళ్లు చేసింది తప్పు ..మన మీద ఆబద్ధాలు చెబుతున్నారని అన్పించినప్పుడు దయ ఉంచి ఖండించండి. దయ ఉంచి ఖండించకపోతే ..ఫ్యాక్ట్స్ చెప్పకపోతే..ఇది నిజమోనేమో అనే వాతావరణానికి తావివ్వకూడదు. కలక్టర్ల దగ్గర నుంచి సీఎండీల దాకా..సేమ్ టైమ్ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా..ఇది పరిగణనలోకి తీసుకోవాలి. మీరు కూడా ఫ్రంట్ ఫుట్ లో బ్యాటింగ్ చేయాలనేది మనసులో పెట్టుకోండి. ఎంతసేపూ బ్యాక్ ఫుట్ లోనే కాదు.జ్ణాపకంలో పెట్టుకుని ఇంప్లిమెంట్ చేయమని అందరినీ కూడా అడుగుతున్నా.' అంటూ వ్యాఖ్యానించారు.