కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ రెండవ సారి శంకుస్థాపన చేశారు. . చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా ఎన్నికలకు ముందు శంఖుస్థాపన చేసారని...తాను మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో పనులకు శ్రీకారం చుడుతున్నానని ..రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అని గతంలో ప్రకటించారు. 2019 డిసెంబర్ లో సీఎం జగన్ తొలిసారి ఇదే కడప స్టీల్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పటివరకు ఏమి జరగలేదు. ఇప్పుడు రెండవసారి 2023 ఫిబ్రవరి 15 న శంఖుస్థాపన చేశారు. అంటే నాలుగేళ్లు కూడా పూర్తి కాకుండానే రెండవ సారి శంకుస్థాపన అన్న మాట. ఇందులోనే జగన్ ఎన్నడూ లేని ఒక కొత్త, వింత ఆచారానికి ఆద్యుడు అయ్యారు.
ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. అదేంటి అంటే శంఖుస్థాపన సందర్భంగా పూజ చేసి కొబ్బరి కాయ కొడతారు. ఇది చాలా సహజం. ఇలాంటి కార్యక్రమాల్లో రాష్ట్ర పతి , ప్రధాని వంటి వారు కూడా కిందకు వంగే కొబ్బరికాయ కొడతారు. కానీ సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టాడని ఇద్దరు పూజారులు ఒక రాయిని పైకి ఎత్తి పట్టుకోవటం..దానిపై జగన్ కొబ్బరికాయ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఓరి...ఇదేందీ ...ఇలా ఎప్పుడు జరగలేదు..ఎక్కడ చూడలేదే అంటూ అవాక్కు అవుతున్నారు. జగనా..మజాకా..అయన స్టైల్ అంతే మరి.