ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ కు సంబంధించి తీర్పు వాయిదా పడింది. వాస్తవానికి సీబీఐ కోర్టు ఆగస్టు 25న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. ఇప్పుడు వచ్చే నెల 15కి వాయిదా వేసింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆరోపిస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన సీబీఐ కోర్టు తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
ఇదే రఘురామక్రిష్ణంరాజు మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా బుధవారం నాడు విచారణ ముగిసింది. ఈ రెండు పిటీషన్లకు సంబంధించి తుది తీర్పును సెప్టెంబర్ 15న ఇవ్వనున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది.