ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం నాడు సచివాలయంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు సీఎం జగన్ గురించి ఆరా తీయటం కాకుండా..ఆరాధించాలని వ్యాఖ్యానించారు. ఆరాధిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పకుండా ఇళ్ళ స్థలాలు వస్తాయని వ్యాఖ్యానించారు. 'సీఎం జగన్‍ను ఆరాధించాను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల నెరవేరుతుంది' అని తెలిపారు. ఆరా తీస్తే ఆరాధనకు సరైన ఫలితాలు రావన్నారు.