ఇది తెలుగువారిని అవమానించటమే

Update: 2020-11-26 17:08 GMT
ఇది తెలుగువారిని అవమానించటమే
  • whatsapp icon

పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ లనుద్దేశించిన ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ అక్భరుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా స్పందించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కూడా అక్భర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. గురువారం సాయంత్రం చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్, పీవీ అని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం మహనీయులను రచ్చకీడుస్తారా? దేశంలో పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేశారని గుర్తుచేశారు. సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పీవీ పరుగులు పెట్టించారని ప్రశంసించారు. ఎన్టీఆర్, పీవీపై వ్యాఖ్యలు తెలుగు వారందరినీ అవమానించడమేనని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News