అమ‌రావ‌తి..పోల‌వ‌రం లేని రాష్ట్రాన్ని ఊహించ‌లేం

Update: 2021-11-01 14:03 GMT

ఏపీ ప్ర‌భుత్వంపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయ‌డు మండిప‌డ్డారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంతో ఏపీ స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ గా మారేద‌ని..మూడు రాజ‌ధానుల పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని రివ‌ర్స్ పాల‌న‌లోకి నెట్టింద‌న్నారు. అమ‌రావ‌తి ఒకే రాజ‌ధానిగా ఉండాలంటూ రైతులు ప్రారంభించిన పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు సంఘీభావం తెలిపారు. ఇది పాద‌యాత్ర కాదు..రాష్ట్ర ప‌రిర‌క్షణ యాత్ర అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. సీఎం జగన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో రైతులకు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టు పెట్టారని తప్పుబట్టారు. ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వకపోవడం దుర్మార్గమన్నారు.

'ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుంది. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుంది. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. గంజాయిపై ప్రశ్నించినవారిపై కేసులు, దాడులు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుంది'' అన్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మంపై అధికార పార్టీ ఎన్ని అస‌త్య ప్ర‌చారాలు చేసినా..అవ‌హేళ‌న‌కు పాల్ప‌డినా రైతులు మాత్రం త‌మ ఆశ‌య సాద‌న‌కు ముందుకు సాగుతున్నార‌ని ప్ర‌శంసించారు.

Tags:    

Similar News