అప్పుడు జగన్..ఇప్పుడు చంద్రబాబు

Update: 2024-12-31 06:26 GMT

రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా నిలపటం సంగతి ఏమో కానీ వాళ్ళు మాత్రం నంబర్ వన్ గానే ఉంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎవరు సీఎం అయినా కూడా దేశంలోనే అత్యంత సంపన్న సీఎం లుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిలుస్తున్నారు. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 931 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే 2023 సంవత్సరంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే నంబర్ వన్ సీఎం గా ఉన్నారు. జగన్ కంటే ఎక్కువ ఆస్తులతో ఇప్పుడు చంద్రబాబు దేశంలోనే ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకున్నారు. దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్న సీఎంగా ఉన్న చంద్రబాబు కు పది కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయట.

                                       కేవలం పదిహేను లక్షల రూపాయల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాబితాలో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా ఈ విషయాలు వెల్లడించింది. దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల్లో రెండవ స్థానంలో అరుణాచల్ సీఎం పెమా ఖండూ ఉన్నారు. ఆయన ఆస్థి 332 కోట్ల రూపాయలు. ఇటు చంద్రబాబు దగ్గర నుంచి జగన్ మోహన్ రెడ్డి వరకు ఎప్పుడు సీఎం గా ఉన్నా కూడా తాము ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెపుతుంటారు. అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు కానీ...వీళ్లిద్దరు మాత్రం ఇప్పటికే దేశంలోనే సంపన్న సీఎం లు గా రికార్డు లు మాత్రం నమోదు చేశారు.

చంద్రబాబు లా మారుతున్న పవన్ కళ్యాణ్ !

Tags:    

Similar News