ట్రాన్స్ స్ట్రాయ్ కు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో శుక్రవారం నాడు సీబీఐ సోదాలు సాగాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ సోదాలు సాగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్ స్ట్రాయ్ బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగవేసిన కేసులో ఈ సోదాలు సాగుతున్నాయి. సోదాల సమయంలో రాయపాటి సాంబశివరావు ఇంట్లోనే ఉన్నారు.
ఏపీకి సంబంధించిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్న ఈ సంస్థ తర్వాత పలు వివాదాల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పనులను నత్తనడకన చేయటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంస్థ నుంచి కొన్ని పనులను తీసేసి వేరే సంస్థలకు అప్పగించారు. చివరకు పోలవరం ప్రాజెక్టు నుంచి పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది.