వివేకా హత్యపై జగన్ కు ముందే తెలుసు...ఆ సంగతి తేల్చాలి !

Update: 2023-05-26 15:25 GMT

తెలంగాణ కోర్టు కు చెప్పిన సిబిఐ

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో కీలక పరిణామం. వివేకా హత్యపై అయన పీఏ ఎం వీ కృష్ణా రెడ్డి బయట ప్రపంచానికి చెప్పే నాటికి అంటే 2019 మార్చి 15 ఉదయం 6 .15 గంటల కంటే ముందే ప్రస్తుత ముఖ్యమంతి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఈ హత్య విషయం తెలిసింది అని..ఇందులో ఉన్న భారీ కుట్రను వెలికి తీయాల్సి ఉంది అని సిబిఐ తెలంగాణ హై కోర్టు కు అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ లో తెలిపింది. జగన్ కు ఈ విషయం అవినాష్ రెడ్డి చెప్పారా లేదా అనే అంశంపై విచారణ చేయాల్సి ఉంది అని పేర్కొంది. సిబిఐ తన కౌంటర్ లో పలు అంశాలను ప్రస్తావించింది. హత్య జరిగిన రోజు రాత్రి అవినాష్ రెడ్డి 12 .27 గంటల నుంచి 1 .10 గంటల వరకు వాట్సాప్ కాల్స్ మాట్లాడారు అని సిబిఐ కోర్టు కి తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసు విచారణను జూన్ 30

వరకు పూర్తి చేస్సాయాల్సి ఉన్నందున అవినాష్ కు బెయిల్ ఇవ్వొద్దు అని...ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది అని వెల్లడించింది. సిబిఐ నోటీసులు జారీ చేసినా గత కొంత కాలంగా అయన ఏదో ఒక కారణం సాకుగా చూపుతూ విచారణకు హాజరు కావటం లేదు అని...మే 22 న కర్నూల్ లో ఆయన్ను అరెస్ట్ చేయటానికి వెళ్లగా ..ఆస్పత్రి ముందు అవినాష్ అనుచరులు అడ్డుగా ఉన్నారని...లా అండ్ ఆర్డర్ సమస్య వస్తదని ఆగిపోయినట్లు తెలిపారు. ఈ కేసు లో ఇప్పుడు సిబిఐ ఏకంగా సీఎం జగన్ పేరును కూడా తీసుకురావటం పెద్ద కలకలం రేపుతోంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టు సిబిఐ వాదనల అనంతరం శనివారం నాడు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News