పొద్దుతిరుగుడు చైర్మన్ కు షాక్ !

Update: 2024-10-14 09:18 GMT

ఆ ఛానెల్ చైర్మన్ వ్యవహారం పొద్దుతిరుగుడు పువ్వులా ఉంటుంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వెంటనే వాళ్ళవైపు వెళ్ళిపోవటం. ఐదేళ్లు అలా నడిపించుకోవటం. కానీ ఈ సారి మాత్రం లెక్క తేడా వచ్చింది. మారటానికి ఆ ఛానెల్ చైర్మన్ సిద్ధంగా ఉన్నా అటు నుంచి మాత్రం దీనికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇటీవలే ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అపాయింట్ మెంట్ కోరితే కూడా కుదరదు అని చెప్పినట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో దసరా పండగ తర్వాత రెండు కీలక ఛానెల్స్ ప్రసారాలు నిలిపివోయబోతున్నట్లు అక్టోబర్ పదిన తెలుగు గేటువే లో వార్త రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజం అయింది. సోమవారం నుంచే ఆంధ్ర ప్రదేశ్ లో పలు చోట్ల టీవీ 9 తో పాటు మరో కీలక ఛానెల్ ప్రసారాలను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి.

                                         సాయంత్రానికి ఇది చాలా వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు ఛానెల్స్ తో పాటు జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన సాక్షి ఛానెల్ ప్రసారాలు కూడా కట్ చేయనున్నారు. కొద్ది రోజులు క్రితం ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రాష్ట్రంలో కీలక కేబుల్ ఆపరేటర్స్ తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వాళ్ళతో భేటీ అయి...ఈ రెండు ఛానెల్స్ ఆపకపోతే విద్యుత్ పోల్స్ పై ఉన్న అన్ని కేబుల్స్ కట్ అవుతాయని చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూడా తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఐదేళ్ల పాటు ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి, టివి 5 , మహా న్యూస్ ప్రసారాలని ఆపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కట్ అయిన ఛానెల్స్ మారాయి.

Tags:    

Similar News