ఏసీబీ కోర్టు తీర్పు తర్వాత సిఐడి కస్టడీకి కోరే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పక్కా ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెపుతోంది. 279 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. రిమాండ్ ను తిరస్కరించాలని...కేవలం రాజకీయ కోణంలోనే చంద్రబాబు ను వేధిస్తున్నారు అంటూ సిద్దార్ధ లూద్రా చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అవినీతి కేసు లో తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావటం ఒకెత్తు అయితే...ఇప్పుడు అయన జైలు కు కూడా వెళ్లనున్నారు. కోర్టు తీర్పు తో టీడీపీ లో నిరాశ నెలకొనగా..అధికార వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటోంది. టీడీపీ మాత్రం అరెస్ట్ కు నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.