జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో ఎదురుబెబ్బ‌

Update: 2022-05-11 03:59 GMT

మూడేళ్ల పాల‌న‌లో కూడా జ‌గ‌న్ స‌ర్కారు ఏ మాత్రం పాఠాలు నేర్చుకున్న‌ట్లు క‌న్పించ‌టంలేదనే అభిప్రాయం ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచే వ్య‌క్తం అవుతోంది. అత్యంత కీల‌క‌మైన అంశాల్లో నిర్ణ‌యాలు తీసుకునే ముందు ఏ మాత్రం ముంద‌స్తు క‌స‌ర‌త్తు చేయ‌కుండా ముందుకు క‌ద‌ల‌ట‌మే ఈ ఎదురుదెబ్బ‌ల‌కు కార‌ణం అవుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు విన్పిస్తున్నాయి. మంగ‌ళ‌వారం నాడు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్ట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. అరెస్ట్ అనంత‌రం చిత్తూరు ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి ప‌లు పేప‌ర్ల లీకేజ్ కు సంబంధించి ప‌లు సాంకేతిక ఆధారాలు దొరికాయ‌ని..అదే స‌మయంలో నారాయ‌ణ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారాంగా ప‌క్కా ఆధారాల‌తోనే అరెస్ట్ చేశామ‌ని చెప్పారు. ఎస్పీ చెప్పిన‌ట్లు నిజంగా పోలీసుల‌కు ప‌క్కా సాంకేతిక ఆధారాలు దొరికితే..ఈ లీకేజీ వ్య‌వ‌హ‌రంలో నారాయ‌ణ పాత్ర ఉన్న‌ట్లు నిరూపించే అంశాలు ఉంటే నారాయ‌ణ పేరు పెట్ట‌కుండా..నారాయ‌ణ విద్యా సంస్థ‌ల ఛైర్మ‌న్ గా ఆయ‌న్ను ప్ర‌స్తావించ‌టంతో సాంకేతిక అంశాల‌తో ఆయ‌న ఒక్క పూట కూడా జైలు గ‌డ‌ప తొక్క‌కుండానే బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలోనే నారాయ‌ణ ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని ప్ర‌భుత్వంలోని అదికారులు..పోలీసులకు తెలియ‌దా?. అత్యంత కీల‌క‌మైన కేసులో అరెస్ట్ చేస్తున్న‌ప్పుడు కూడా ఇంత ఉదాసీనంగా ఉంటారా అన్న చ‌ర్చ సాగుతోంది. అధికారులు...పోలీసులు ఏ మాత్రం ముందు క‌స‌ర‌త్తు చేయ‌కుండా కేసును నీరుగార్చార‌నే విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌నే వ‌స్తున్నాయి. గ‌తంలో ఇలాంటి అనుభ‌వాలు ఎన్నో ఉన్నా కూడా క‌నీస క‌స‌ర‌త్తు చేయ‌కుండా ప్ర‌భుత్వం అభాసుపాలు అవుతోంద‌ని ఓ ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ లో అరెస్ట్ చేసిన అనంత‌రం నారాయ‌ణ‌ను చిత్తూరు జిల్లాలో న్యాయ‌మూర్తి సులోచ‌నా రాణి ముందు హాజ‌రుప‌ర్చ‌గా ఆమె నారాయ‌ణ త‌ర‌పు లాయ‌ర్ల వాద‌న‌ల‌తో ఏకీభవించి ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేశారు.

లక్ష రూపాయ‌ల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ తరపు న్యాయవాదులు పేపర్లతో సహా ఆధారాలను న్యాయమూర్తికి చూపించారు. పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. దీంతో అత్యంత కీల‌క‌మైన ఈ కేసులో ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లు అయింది. పేప‌ర్ లీకేజీల అంశంలో సాంకేతిక ఆధారాల‌ను వ‌దిలేసి...ఏ మాత్రం క‌స‌ర‌త్తు చేయకుండా నారాయ‌ణ విద్యా సంస్థ‌ల ఛైర్మ‌న్ అనే కోణంలో కేసును ముందు పెట్ట‌డంతో న్యాయ‌స్థానంలో చుక్కెదురు అయింద‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అలా కాకుండా పక్కా ఆధారాల‌ను ముందు పెట్టి నారాయ‌ణ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌స్థాపకుడు అన్నా ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం నాడు నారాయ‌ణ అరెస్ట్ అనంత‌రం మంత్రులు అంతా నారాయ‌ణ అరెస్ట్ కు ఆధారాలు ఉన్నాయ‌ని బ‌లంగా వాదించారు. కానీ వెంట‌నే సీన్ రివర్స్అయింది. 

Tags:    

Similar News